News May 11, 2024

మదనపల్లె టమోటా మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మదనపల్లె టమోటా మార్కెట్‌కు ఆర్‌ఓ హరిప్రసాద్ 2రోజులు సెలవు ప్రకటించారు. మదనపల్లెలో ఎన్నికలు 13న జరగనున్న నేపథ్యంలో ఐదు పోలింగ్ కేంద్రాలు నీరుగట్టువారిపల్లెలో ఉన్నాయి. దీంతో మదనపల్లె టమోటా మార్కెట్ యాడ్‌ను ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం సాయంత్రం 7గంటల వరకు ఎలక్షన్ ఆఫీసర్ల అధీనంలో ఉంటుంది. ఆది, సోమవారాలు టమోటా రైతులు మార్కెట్‌కు టమోటాలు తీసుకురావద్దని కోరారు.

Similar News

News February 14, 2025

చిత్తూరు: ‘ధర్నాకు అనుమతులు లేవు’

image

చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం వైసీసీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు టౌన్ డీఎస్పీ సాయినాథ్ స్పందిస్తూ ధర్నాకు పోలీసులు ఎటువంటి ముందస్తు అనుమతులు ఇవ్వలేదన్నారు. ధర్నాకు హాజరు కావాలని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అనుసరించి ధర్నాకు సహకరించిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని గురువారం డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

News February 13, 2025

బైరెడ్డిపల్లి: సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన యువకుడు

image

బైరెడ్డిపల్లికి చెందిన మేస్త్రి కృష్ణప్ప కుమారుడు విశ్వనాథ్ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్న.. నా భార్య, కూతురును బాగా చూసుకోండి. నేను చనిపోయాక వచ్చే చంద్రన్న బీమా, ఇన్సూరెన్స్ నగదు నేను ఇవ్వాల్సిన అప్పుల వాళ్లకు ఇచ్చి మిగిలిన డబ్బులు నా భార్య బిడ్డలకు ఇవ్వండి’ అని లెటర్‌లో రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తన తండ్రి తెలిపాడు.

News February 13, 2025

సదుం: జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపిక

image

జాతీయ కబడ్డి సీనియర్ మహిళా విభాగం జట్టుకు సదుం కబడ్డీ క్లబ్ క్రీడాకారులు గుల్జార్, రుక్సానా ఎంపికైనట్టు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి గురువారం తెలిపారు. డిసెంబర్లో ప్రకాశం జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపడంతో వారు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో ఏపీ తరఫున వారు పాల్గొంటారని పేర్కొన్నారు.

error: Content is protected !!