News November 11, 2024

మదనపల్లె పూర్వ RDO అక్రమ ఆస్తులు రూ.230 కోట్లు!

image

మదనపల్లె పూర్వ RDO MS మురళి భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు మురళి కూడబెట్టిన ఆస్తులపై శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. కిలో బంగారు ఆభరణాలు, 800 గ్రా. వెండి, ఏడు ఇళ్లు, ఒక హోటల్, 12 స్థలాలు, 20 బ్యాంకు ఖాతాలు, 8 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ రూ.230 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయనను ఆదివారం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.

Similar News

News October 23, 2025

చిత్తూరు: ఉపాధ్యాయ సమస్యలపై ZP సీఈఓ సమీక్ష

image

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై ZP సీఈవోతో ఎస్టీయు నేతలు సమీక్షించారు. మిస్సింగ్ క్రెడిట్ వెంటనే క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు తుది మొత్తాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని వివరించారు. ఇన్ సర్వీస్‌లో టీచర్‌గా సెలెక్ట్ అయిన వారిని రిలీవ్ చేయాలని కోరారు.

News October 23, 2025

మేయర్ దంపతుల హత్య కేసులో రేపు తీర్పు

image

రాష్ట్రంలో సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యపై రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 21 మంది నిందితులు 122 మంది సాక్షుల విచారణ కోర్టు పూర్తి చేసింది. 10 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. కోర్టు వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.

News October 23, 2025

చిత్తూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

image

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్‌లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 9491077325, 08572242777