News July 29, 2024

మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటన.. ఇద్దరు RDOలు సస్పెండ్

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఇద్దరు RDOలు, సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అగ్ని ప్రమాదం ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం వంటి అభియోగాలను వారిపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే CI, మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 12, 2024

శ్రీకాళహస్తి స్వామివారి సేవలో బాలకృష్ణ సతీమణి

image

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిహెచ్ఓ నాగభూషణం, ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

News October 12, 2024

చిత్తూరులో ప్రజా పరిష్కార వేదిక వాయిదా

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 15వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈనెల 14న జరగాల్సిన కార్యక్రమాన్ని 15వ తేదీకి మారుస్తున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.

News October 12, 2024

TTDపై అభ్యంతరకరంగా పోస్ట్.. వ్యక్తిపై కేసు

image

TTD ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చైతన్య అనే వ్యక్తిపై తిరుమల 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం పట్టు వస్త్రాలను తీసుకెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.