News May 11, 2024

మదనపల్లె: బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

image

మదనపల్లె పట్టణం వారపు సంతలో బస్సు ఢీకొని గుత్తిని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారాన్ని తెలుసుకున్న రెండో పట్టణ ఎస్సై వెంకటసుబ్బయ్య మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.

Similar News

News December 1, 2025

చిత్తూరులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. పలువురు సమస్యలను ఆయన నేరుగా తెలుసుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపారు. సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో డీఆర్వో మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

News December 1, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. సోమలలో అత్యధికంగా 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గుడిపాలలో 2.4 మి.మీ పడింది. కార్వేటినగరంలో 19. 2, పులిచెర్లలో 15.8, విజయపురంలో 15.4, రొంపిచర్లలో 14.8, సదుంలో 13, వెదురుకుప్పంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.