News May 26, 2024
మదనపల్లె: మాజీ జడ్జిపై కేసు నమోదు

భూవివాదం నేపథ్యంలో మాజీ జడ్జితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. మదనపల్లె రోడ్డులోని కొంత భూమి విషయంలో పట్టణానికి చెందిన మాజీ జడ్జి రామకృష్ణకు ఆయన సోదరుల మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రామచంద్ర, శంకరప్పలపై గత ఆదివారం రామకృష్ణ, అతని అనుచరులు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మాజీ జడ్జితో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News October 23, 2025
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు.. CM సూచనలు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని CM సూచించారు. చెరువులకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్టం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన కలెక్టర్కు వివరించారు.
News October 23, 2025
చిత్తూరు: ఉపాధ్యాయ సమస్యలపై ZP సీఈఓ సమీక్ష

దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై ZP సీఈవోతో ఎస్టీయు నేతలు సమీక్షించారు. మిస్సింగ్ క్రెడిట్ వెంటనే క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు తుది మొత్తాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని వివరించారు. ఇన్ సర్వీస్లో టీచర్గా సెలెక్ట్ అయిన వారిని రిలీవ్ చేయాలని కోరారు.
News October 23, 2025
మేయర్ దంపతుల హత్య కేసులో రేపు తీర్పు

రాష్ట్రంలో సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యపై రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 21 మంది నిందితులు 122 మంది సాక్షుల విచారణ కోర్టు పూర్తి చేసింది. 10 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. కోర్టు వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.