News January 31, 2025
మదనపల్లె: యువతి ఆత్మహత్యాయత్నం

వంట చేయలేదని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రి ఔట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. బిహార్ రాష్ట్రం దివాన్ గంజికి చెందిన మోహన్లాల్ బతుకు తెరువుకోసం పుంగనూరుకు వచ్చి అక్కడి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె ప్రియాంక(19) వంటచేయలేదని గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో విషం తాగిన యువతిని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 15, 2025
మేడిగడ్డ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు

TG: వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్, డిజైన్లకోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. HYD, మద్రాస్, రూర్కీ IITలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండడంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తోంది. NDSA సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది.
News October 15, 2025
ఒంగోలులో వ్యక్తి మిస్సింగ్.. ఎక్కడైనా చూశారా..!

ఒంగోలు పరిధిలోని శ్రీనగర్ కాలనీ ఒకటవ లైన్లో ఉండే భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి (దేవుడు) ఆదివారం మిస్ అయినట్లు ఒంగోలు తాలూకా PSలో ఫిర్యాదు అందింది. మిస్ అయిన వ్యక్తి భార్య వివరాల ప్రకారం.. పొన్నలూరు మండలం కొత్తపాలెంకి చెందిన శ్రీనివాసరెడ్డి ఒంగోలులో స్థిరపడ్డారు. కాగా ఆదివారం బ్యాంక్లో క్రాఫ్లోన్ కట్టేందుకు స్వగ్రామానికి వెళ్లున్నానని వెళ్లాడన్నారు. వివరాలు తెలిస్తే 9177688912కు కాల్ చేయాలన్నారు.
News October 15, 2025
మల్లోజులకు అడవిబాట ఏటూరునాగారమే..!

మావోయిస్టు అగ్రనేత, సీసీ కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగోపాల్@అభయ్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. ఆయనతోపాటు 60 మంది వివిధ కేడర్లలో పనిచేసే సభ్యులతో పాటు ఆయన జనజీవన స్రవంతిలో కలవనున్నారు. అయితే మల్లోజుల 1981లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి పీపుల్స్ వారు పార్టీలో చేరి ఏటూరునాగారం దళంలో సభ్యుడిగా చేరారు. సభ్యుడి స్థాయి నుంచి పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు.