News December 12, 2024

మదనపల్లె: రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు

image

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం సెలవు ప్రకటించామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని మండలాలకు మాత్రమే వర్తిస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Similar News

News November 28, 2025

చిత్తూరు: సివిల్స్ ఎగ్జామ్‌కు ఫ్రీ ట్రైనింగ్

image

యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News November 28, 2025

BLOల నియామకానికి ప్రతిపాదనలు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోల నియామకానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. బీఎల్ఓలందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు.

News November 27, 2025

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొనాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సర్వే జరుగుతోందని, ప్రతి ఒక్క అధికారి రైతుల ఇళ్లకు వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.