News December 6, 2024

మదనపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ 

image

మదనపల్లె అమ్మచెరువు మిట్టలో ఇవాళ వేకువజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బి.కొత్త కోటమండలం బండమీదపల్లెకు చెందిన నరేశ్ కుమార్ రెడ్డి(26)తోపాటు నీరుగట్టుపల్లె మాయాబజార్‌కు చెందిన దామోదర్ రెడ్డి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి మహేందర్(20) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

చిత్తూరు: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

జిల్లాలో భారీగా పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట దిగుబడులు తగ్గి ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పచ్చిమిరప రూ.40 నుంచి రూ.60కి, బీర రూ.40-రూ.60, వంకాయలు రూ.90-రూ.120 వరకు చేరుకున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News November 21, 2025

బెంగళూరులో రూ.7కోట్ల దోపిడీ.. చిత్తూరులో కారు

image

బెంగళూరు జేపీ నగర్‌లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి HDFC బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. రూ.7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులోకి మార్చుకుని పారిపోయారు. చిత్తూరు(D) గుడిపాల మండలం చీలాపల్లి కూడలి పెట్రోల్ బంకు వద్ద కారు వదిలి పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 21, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, ఎయిడెడ్, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు HM అకౌంట్ టెస్టుకు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు. ఓ పేపర్‌కు రూ.100, 2పేపర్ల పరీక్ష రాసేందుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.60 అపరాధ రుసుముతో నవంబరు 30వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.