News December 6, 2024

మదనపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ 

image

మదనపల్లె అమ్మచెరువు మిట్టలో ఇవాళ వేకువజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బి.కొత్త కోటమండలం బండమీదపల్లెకు చెందిన నరేశ్ కుమార్ రెడ్డి(26)తోపాటు నీరుగట్టుపల్లె మాయాబజార్‌కు చెందిన దామోదర్ రెడ్డి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి మహేందర్(20) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 18, 2025

తిరుపతి తొక్కిసలాట పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రిని ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొక్కిసలాటకు గవర్నర్ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని.. వెంటనే పిటిషన్‌లో సీఎం, గవర్నర్ కార్యదర్శి పేర్లను తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారం(22వ తేదీ)కి వాయిదా పడింది.

News January 18, 2025

తిరుపతి జిల్లాలో జీతం లేని ఉద్యోగాలు

image

డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో పీఎంఎఫ్ఎంఈ ద్వారా తిరుపతి జిల్లాలో రిసోర్స్ పర్సన్ ఎంపిక చేయనున్నట్లు పీడీ శోభన్ బాబు తెలిపారు. ఏపీ పుడ్ ప్రొసెసింగ్ సొసైటీ ద్వారా మండల స్థాయిలో పని చేసే అవకాశం ఉంటుంది. మైక్రో పుడ్ ప్రోసెసింగ్ ఏర్పాటుతో పాటు మొబిలైజేషన్ చేపట్టాల్సి ఉంటుంది. జీతం ఉండదు. కేవలం ఇన్సెంటివ్‌పై పనిచేయాల్సి ఉంటుంది. ఈనెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

News January 18, 2025

తిరుపతి: ఎంత ఘోరమో కదా..!

image

చిత్తూరు గంగాసాగరం రోడ్డు ప్రమాదంలో అనేక విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతిలోని సప్తగిరి నగర్‌కు ‌చెందిన పొన్ను చంద్ర(38) తల్లితో కలిసి మధురైలోని ఆసుపత్రికి బయల్దేరారు. తల్లి కింద సీటులో కూర్చోగా.. చంద్ర పైన సీటులో నిద్రించారు. బస్ బోల్తా పడినప్పుడు ఓ కరెంట్ స్తంభం బస్‌లోకి దూసుకొచ్చింది. దీంతో చంద్ర చనిపోగా.. తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ కళ్లెదుటే కొడుకు చనిపోవడంతో నిర్ఘాంతపోయారు.