News November 25, 2024

మదనపల్లె వాసికి అనంతపురంలో సత్కారం

image

మదనపల్లె పట్టణానికి చెందిన రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి లింగాల యుగంధరాచార్యుడికి అనంతపురంలో లేపాక్షి ఫౌండేషన్ వారు ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు మాట్లాడుతూ.. లింగాల యుగంధరాచార్యుడు తన రచనలతో ఎన్నో గ్రంథాలను రచించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం నాటికలు వేశారని తెలిపారు.

Similar News

News December 14, 2024

నగరి: విద్యుత్ సిబ్బంది సాహసం.. బోటులో వెళ్లి మరమ్మతులు

image

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గూళూరు చెరువు పూర్తిగా నీటితో నిండింది. దీంతో వడమాల పేట మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సిబ్బంది నిండుకుండలా మారిన గూళూరు చెరువులోకి బోటులో వెళ్లి లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. ప్రాణాలకు తెగించి వారు చూపిన తెగువను పలువురు అభినందించారు. 

News December 14, 2024

తిరుపతిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

image

తన ప్రేమ విషయం ఎక్కడా తండ్రికి తెలుస్తుందో అన్న భయంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రొంపిచెర్ల మండలానికి చెందిన ఓ అమ్మాయి తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. అక్కడే అన్నతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటోంది. ఆమె తోటి విద్యార్థిని ప్రేమించింది. ఈ విషయం ఆమె అన్నకు తెలియడంతో ఎక్కడ తండ్రికి చెబుతాడోమోనని భయపడి ఇంట్లోనే ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 14, 2024

జమ్మూ కశ్మీర్‌లో కుప్పం జవాన్ మృతి

image

కుప్పం మండలానికి చెందిన ఓ జవాన్ జమ్మూ కశ్మీరులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ములకలపల్లెకు చెందిన మునియప్ప కుమారుడు పొన్నుస్వామి రెండేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. జమ్మూలో విధులు నిర్వహిస్తున్నఆయన రెండు రోజులు అనారోగ్యం పాలయ్యాడు.  చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు వారు తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సొంత గ్రామంలో జరగనున్నాయి.