News July 31, 2024

మదనపల్లె: హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు

image

టైర్ల కంపెనిలో పని చేయడానికి వచ్చిన కార్మికుడిని కత్తితో పొడిచి హత్యచేసి, మరొక వ్యక్తిపై దాడిచేసిన కేసులో నిందితునికి మదనపల్లె 2వ అదనపు జిల్లాజడ్జి బందెల అబ్రహాం జీవితఖైదు విధిస్తూ బుధవారం సంచలన తీర్పుచెప్పారు. ఏపీపీ, టూ టౌన్ సీఐ యువరాజ్, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాలు.. మదనపల్లి భాగ్యలక్ష్మి రైస్ మిల్లులో టైర్ల తయారీకి వచ్చిన కేరళ మణికంఠన్‌ను 2016లో సుబ్రహ్మణ్యం హత్యచేయడంతో శిక్ష పడింది.

Similar News

News October 8, 2024

చిత్తూరు: 365 మంది VRO లు బదిలీ

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 365 మంది వీఆర్వోలను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్ 1 కేడర్ వీఆర్ఓలను 240 మంది, గ్రేడ్ 2 కేడర్‌లో 125 మంది మొత్తం 365 మంది వీఆర్ఓలను బదిలీ చేశారు. బదిలీ అయిన వీఆర్ఓలు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News October 8, 2024

చిత్తూరు: ఉచిత ఇసుక విధానం అమలు : కలెక్టర్

image

జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్, ఎస్ పి మణికంఠ చందోలుతో కలిసి ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. https://sand.ap.gov.in/ ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News October 7, 2024

మదనపల్లె: స్వర్ణకుమారిది హత్యే .. పోలీసుల అదుపులో వెంకటేశ్

image

మదనపల్లె జగన్ కాలనీలో గత నెల 9న అదృశ్యమైన స్వర్ణకుమారిని హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడు వెంకటేశ్‌ను సోమవారం కర్ణాటకలో పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఆమెను పథకం ప్రకారం హత్యచేసి, 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతిపెట్టినట్లు తెలుసుకున్నారు. మంగళవారం DSP, MROల సమక్షంలో హత్య కేసు వివరాలు, వెంకటేశ్ అరెస్టు మీడియాకు బహిర్గతం చేయనున్నారు.