News April 16, 2024

మదనాపురం: సాగులో సందేహాలకు సంప్రదించండి

image

సాగులో అన్నదాతలకు ఎదురవుతున్న సమస్యలు, చీడ పీడల నివారణకు చర్యలు, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులపై సందేహాలకు నివృత్తి చేసేందుకు మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అన్నారు. వివరాలకు 94408 35658 సంప్రదించాలన్నారు.

Similar News

News December 24, 2024

MBNR: నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ సెంటర్: కలెక్టర్

image

జిల్లాలోని యువత నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ సెంటర్ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. MBNR లో ఏర్పాటు చేస్తున్న స్కిల్ సెంటర్‌ను సోమవారం అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు దిగ్గజ సంస్థలలో ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన నైపుణ్యాలు కల్పించడం, ఆంగ్లంలో మాట్లాడడం, మౌఖిక పరీక్షలు ఎదుర్కొనేల శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

News December 23, 2024

MBNR: జిల్లాలో పెరిగిన చలి పులి

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొన్నటితో పోలిస్తే చలి తీవ్రత పెరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయాన్నే స్నానాలు చేసి బడికి వెళ్లే విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. గత 24 గంటలలో గద్వాల జిల్లా ఇటిక్యాల మం. సాతర్ల గ్రామంలో 18.0, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మం. కేంద్రంలో 15.7, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మం. తోటపల్లి 16.7, వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో 18.1డిగ్రీల కనిష్ఠ నమోదయ్యాయి.

News December 23, 2024

పాలమూరులో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం

image

పాలమూరు జిల్లాలో సంతానం లేక బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. కాగా ఇప్పటివరకు హైదరాబాద్‌లోని గాంధీ, పేట్ల బురుజు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుతుండగా ఇకపై పాలమూరులోనూ అందనున్నాయి. డబ్బు ఖర్చు చేసే స్తోమత లేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగకరం కానుంది.