News April 24, 2024

మదన్ రెడ్డి పోయినా BRSకి ఎలాంటి నష్టం లేదు: హరీశ్ రావు

image

మదన్ రెడ్డి BRSకు నమ్మకద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేశారని.. ఆయన పార్టీ మారినంత మాత్రమే BRSకు వచ్చిన నష్టమేమని లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నర్సాపూర్‌లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. మదన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా తన మిత్రుడు అని కేసీఆర్ రెండుసార్లు టికెట్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు ఆయన్ను గెలిపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు చేరానని మదన్ రెడ్డి బాధపడుతున్నారని అన్నారు.

Similar News

News September 15, 2025

మెదక్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు పక్కాగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ బాలికల హై స్కూల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు ఈ పరీక్షలు 6 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

News September 15, 2025

మెదక్: ప్రజా పాలన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్

image

ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉత్సవంలో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారు. మెదక్‌లో జరిగే కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 15, 2025

మెదక్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి బాధ్యతలు

image

మెదక్ జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) ఇన్‌స్పెక్టర్‌గా ఎం. కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు బాధ్యతలుగా టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.