News September 13, 2024

మదర్ డైరీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా

image

ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఆరుగురు భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన వారిలో కల్లెపల్లి శ్రీశైలం, గుడిపాటి మధుసూదన్ రెడ్డి, పుష్పాల నర్సింహులు, బత్తుల నరేందర్ రెడ్డి, రుద్రాల నరసింహ రెడ్డి, మండలి జంగయ్య ఉన్నారు. గెలుపొందిన వారికి ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 24, 2025

NLG: ఏర్పాట్లు వేగవంతం… సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి

image

జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆదనపు బలగాలు, రాత్రి పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ తదితర వాటికి సంబంధించి దృష్టి సారిస్తున్నారు.

News November 24, 2025

NLG: ‘TCC పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి’

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామ్, లోయర్ అండ్ హయ్యర్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bse.telangana.gov.in ను చూడాలన్నారు. .

News November 24, 2025

ఉత్కంఠకు తెర… రిజర్వేషన్లు ఖరారు!

image

జిల్లాలో గ్రామపంచాయతీ రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలో మొత్తం 869సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. ఇందులో 384 పంచాయతీలను అన్ రిజర్వుడ్‌, మహిళలకు 186, జనరల్‌కు 198 స్థానాలు కేటాయించారు. బీసీలకు 140 స్థానాలు రిజర్వుకాగా.. అందులో మహిళలకు 62, జనరల్ కు 78 స్థానాలను కేటాయించారు. ఎస్సీలకు 153, ఎస్టీ కేటగిరిలో 192 స్థానాలు రిజర్వు అయ్యాయి.