News September 14, 2024
మదర్ డైరీ ఛైర్మన్గా మధుసూదన్ రెడ్డి

రంగారెడ్డి నల్లగొండ మదర్ డైరీ ఛైర్మన్గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్షిప్ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News December 5, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలులో వేగంపై కమిషనర్ ఆదేశాలు

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో పారదర్శకత, వేగం పెంచాలని గురువారం రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. కొనుగోలు కేంద్రాలు, పేమెంట్ జాప్యం, సీఎంఆర్ సరఫరా, రవాణా వ్యవస్థపై సమీక్ష చేసి, పూర్తి డిజిటలైజేషన్తో ట్యాబ్ ద్వారా తేమ, తూకం, రైతు రిజిస్ట్రేషన్ వివరాలు పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ కావాలని ఆదేశించారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. నల్గొండ జిల్లా వ్యయ పరిశీలకుడిగా ఆదిత్య

నల్గొండ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎస్.వెంకట్ ఆదిత్యను జిల్లా వ్యయ పరిశీలకుడిగా గురువారం నియమించారు. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ, అభ్యర్థుల ఖర్చుల నమోదు, అక్రమ ఖర్చుల నియంత్రణపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తారని అధికారులు తెలిపారు.


