News April 4, 2024
మద్దికేర రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి

మద్దికేర గ్రామ శివారులో ఇటీవల బొలెరో టైరు పగిలి విద్యుత్ స్తంభానికి ఢీకొని బోల్తాపడిన ఘటన తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న మద్దికేర గ్రామానికి చెందిన కూలీలు ఆదిలక్ష్మి (50), సంజమ్మ (40) అదే రోజు మరణించారు. కురువ లక్ష్మీదేవి (35) సావిత్రమ్మ(65) చికిత్స పొందుతూ బుధవార రాత్రి మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Similar News
News October 24, 2025
తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ రూపొందించండి: కలెక్టర్

జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎన్ఎస్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
News October 23, 2025
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించండి: కలెక్టర్

కర్నూలు నగర ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలని సంబంధింత అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. గురువారం సాయంత్రం కర్నూలు నగర శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. ట్యాంక్ స్థితి, నీటి నిల్వను సమీక్షించారు. సమ్మర్ సిద్ధతలను దృఢంగా క్రమబద్ధం చేయాలని ఆదేశించారు. తక్షణ మరమ్మతులు, రక్షణ చర్యలపై అధికారులు దృష్టి పెట్టేలా సూచించారు. తాగునీటి సరఫరా సురక్షితం చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.
News October 23, 2025
రైతులకు భూమాత రక్షణ, మిశ్రమ పంటలపై అవగాహన కల్పించండి: కలెక్టర్

భూమాత రక్షణ కార్యక్రమం ద్వారా రైతులకు మిశ్రమ పంటల సాగు, ఎరువుల సమర్థ వినియోగంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎక్కువ రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న 100 గ్రామపంచాయతీలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సబ్ డివిజనల్, గ్రామస్థాయిల్లో భూమాత రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.