News April 5, 2024
మద్దికేర రోడ్డు ప్రమాదంలో ఐదుకి చేరిన మృతుల సంఖ్య

మద్దికేర గ్రామ శివారులో ఆదివారం ఆటో టైరు పేలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు మృతిచెందగా.. మద్దికేర గ్రామానికి చెందిన గొడుగు వెంకటేశ్వరమ్మ (55) ఇవాళ ఉదయం మరణించినట్లు భర్త ప్రభాకర్ తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది.
Similar News
News December 15, 2025
కర్నూలు జిల్లా క్రీడాకారులను అభినందించిన నారా లోకేశ్

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ గేమ్స్లో పాల్గొంటున్న జిల్లా స్విమ్మర్స్ను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. డిల్లీ పర్యటనకు వచ్చిన లోకేశ్ను సోమవారం న్యూ ఎంపీ ఫ్లాట్లో క్రీడాకారులు హేమలత, శృతి, సిరి చేతన రాజ్, లహరిలు కలిశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
News December 15, 2025
కర్నూలు: అంగన్వాడీల టీచర్లకు ఫోన్లు ఇచ్చిన కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ 5-జీ సెల్ఫోన్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీలో సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీచర్లకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
News December 15, 2025
కర్నూలు: అంగన్వాడీలకు ఫోన్లు ఇచ్చిన కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ 5-జీ సెల్ఫోన్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.


