News November 30, 2024

మద్దిపాడులో చిన్నారి మృతి

image

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు సూర్య ఓ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా గేటు ఊడి బాలుడిపై పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన బాలుడు అక్కడే పనిచేస్తున్న వాచ్‌మెన్ మనవడు అని సమాచారం.

Similar News

News January 9, 2026

ప్రకాశం: లోన్ తీసుకున్నారా.. అసలు కడితే చాలు.!

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు SC కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి వారికోసం ప్రస్తుతం వడ్డీ పూర్తి రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.

News January 9, 2026

త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

image

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.

News January 9, 2026

ఈనెల 14న ఉమ్మడి ప్రకాశం జిల్లా షటిల్ టోర్నమెంట్

image

పర్చూరులోని NTR క్రీడా వికాస కేంద్రంలో ఈ నెల 14న మెన్ డబుల్స్ షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ సమీవుల్లా తెలిపారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. విజేతలకు 1వ బహుమతిగా రూ.15,116లు, 2వ బహుమతి రూ.10,116లు, 3వ బహుమతి రూ.5,116లు, 4వ బహుమతి రూ.3,116లగా నిర్ణయించినట్లు చెప్పారు. వివరాలకు స్టేడియం నిర్వాహకులను సంప్రదించాలన్నారు.