News February 3, 2025

మద్దిపాడు: ఉపాధ్యాయుడు సస్పెండ్

image

మద్దిపాడు మండలం వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపబోయిన రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. పిల్లలపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి డీఈవో కిరణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలతతో కలిసి మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News February 17, 2025

ప్రకాశం: కంభంలో మహిళ ఆత్మహత్య

image

కంభం మండలంలో వ్యాస్మాల్ తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గోవిందాపురానికి చెందిన శ్యామల భర్తతో విడిపోయి కంభంలోని బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరి మధ్య గొడవ కారణంగా మనస్తాపం చెంది ఆదివారం వ్యాస్మాల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కాపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

News February 16, 2025

విద్యార్థులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి: ఎస్పీ

image

విద్యార్థులు తమ సామర్థ్యాలకు అనుగుణంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఆదివారం ఒంగోలులో జరిగిన బాలోత్సవం కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి స్థాయి నుండే బాలలు మంచి అలవాట్లతో, ఒత్తిడి లేని విధానంలో అభివృద్ధి చెందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు

News February 16, 2025

ప్రకాశం: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

image

పల్నాడు జిల్లా నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందిన విషయం తెసిందే. హైదరాబాద్ నుంచి మద్దిపాడుకు వస్తుండగా లారీ, కారును ఢీకొట్టింది. తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

error: Content is protected !!