News March 20, 2024
మద్దిపాడు: చికిత్స పొందుతూ మహిళ మృతి
ఎలుకల మందు తిని ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మద్దిపాడులోని బీసీ కాలనీకి చెందిన అన్నపరెడ్డి వెంకటలక్ష్మి(26) ఏడాదికాలంగా మానసికంగా ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలో ఈనెల 17న ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలు రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 21, 2024
పర్చూరు: ‘జాగ్రత్తగా లేకుంటే మరో బుడమేరు ప్రమాదం’
ఉప్పుటూరు గ్రామానికి పక్కనే ఉన్న వాగు వెంబడి కట్టలు తెగి ఉండడం పట్ల గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో వచ్చిన తుఫాను కారణంగా కట్టలు తెగాయని అవి బాగుచేయకుంటే మరో బుడమేరు ప్రమాదాన్ని పర్చూరులో చూడాలని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కట్టలను బాగుచేయాలని వాగువెంబడే అనుకొని ఉన్న ఉప్పుటూరు, వీరన్నపాలెం గ్రామవాసులు కోరుతున్నారు.
News September 21, 2024
బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కరణం వెంకటేష్?
బాపట్ల జిల్లా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశం అధినేత జగన్ సమక్షంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా చీరాల ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.
News September 20, 2024
ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి?
ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డా.బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇవాళ జిల్లాలోని నేతలు అందరితో సమావేశం నిర్వహించి చర్చించారు. అనంతరం జిల్లా నేతలు అందరూ బూచేపల్లిని సన్మానించారు. దీంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇచ్చారని దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.