News March 24, 2025
మద్దిరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో జరిగింది. స్థానికుల, పోలీసుల వివరాలు.. AP కృష్ణజిల్లా నూజివీడు తాలుకాకి చెందిన యాకుబ్(23) MHBD జిల్లాలో ఉంటున్నాడు. ఆదివారం కూలీల కోసం కుంటపల్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో మూలమలుపు వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో స్పాట్లోనే యాకుబ్ మృతిచెందాడు. కేసు నమోదైంది.
Similar News
News November 3, 2025
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమైంది. దీని కోసం 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
News November 3, 2025
బస్సు ప్రమాదంలో చనిపోయింది వీరే

TG: <<18184333>>బస్సు ప్రమాదంలో<<>> 19 మంది మరణించగా 15 మందిని అధికారులు గుర్తించారు.
మృతులు: దస్తగిరి బాబా- డ్రైవర్, గుర్రాల అభిత (21)- యాలాల్, మల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్, షేక్ ఖలీల్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, ముస్కాన్, సాయిప్రియ, నందిని, తనూష- తాండూరు, తారిబాయ్ (45)- దన్నారం తండా, గోగుల గుణమ్మ, కల్పన (45)- బోరబండ, హైదరాబాద్, బచ్చన్ నాగమణి (55)- భానూరు, ఏమావత్ తాలీబామ్- ధన్నారం తండా
News November 3, 2025
బాపట్ల కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

బాపట్ల కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. అందులో ఓ వ్యక్తి కార్యాలయం వద్ద పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


