News March 17, 2025

మద్ది అంజన్నను దర్శించుకున్న సినీ హీరో నితిన్

image

జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని సినీ హీరో నితిన్, మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్, దర్శకుడు వెంకి కుడుముల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం హీరో నితిన్‌కు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ముఖ మండపం వద్ద వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. 

Similar News

News October 20, 2025

దీపావళి రోజన పిల్లిని పూజించే ఆచారం..

image

దీపావళిని మనం అజ్ఞానాన్ని తొలగించే దివ్య దీపాల పండుగ్గా జరుపుకొంటాం. కానీ అపశకునంగా భావించే పిల్లిని లక్ష్మీదేవిగా కొలిచి పూజించే సంప్రదాయం రాజస్థాన్‌లో ఉంది. దీపావళి పర్వదినాన అక్కడి మహిళలు మార్జాలానికి నైవేద్యం సమర్పిస్తారు. కర్ణాటకలోనూ ఈ ఆచారం ఉంది. ఆ రోజు తమ నగలను స్త్రీలు నదిలో శుభ్రం చేసి, అన్ని రకాల పిండి వంటలు వండి, పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.

News October 20, 2025

ADB: గుస్సాడీ వేషధారణలో అదరగొట్టిన బాలుడు

image

భీంపూర్ మండలంలోని వాడేగామ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు కాత్లే ఉమేష్ ఆదివాసీల గుస్సాడీ వేషధారణలో అదరగొట్టాడు. ఎంత ఆధునికత వచ్చినా, సంస్కృతిని కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందున్నారని, ఈ బాలుడి రూపంలో వారసత్వం తరాలుగా ప్రవహిస్తోందని స్థానికులు కొనియాడారు. ఈ గుస్సాడీ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది.

News October 20, 2025

నిర్మల్: జిల్లాలో మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు

image

జిల్లాలో 47 నూతన మద్యం దుకాణాలకు సంబంధించి మొత్తం 942 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. మద్యం దుకాణాల దరఖాస్తు గడు ఈనెల 23వ తేదీ వరకు పొడగించినట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు మధ్య దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. ఈనెల 27న దుకాణాల టెండర్లను డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు.