News April 16, 2025
మద్దూరులో మంత్రి పర్యటన.. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్

భూభారతి పోర్టల్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలం ఖాజీపూర్‌లో గురువారం నిర్వహించే రెవెన్యూ సదస్సుకు హాజరవుతున్న రెవెన్యూ, సమాచార పౌరా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈరోజు పర్యవేక్షించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 28, 2025
టాక్సిక్ వర్క్ కల్చర్‌లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్‌లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు.
News November 28, 2025
నాగార్జున సాగర్: శిల్పాలతో బుద్ధుని జీవితం బోధపడేలా..!

నాగార్జునసాగర్‌లో నిర్మిస్తోన్న బుద్ధచరిత వనం ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. ఇక్కడి శిల్పాలు బుద్ధుడి సంపూర్ణ జీవన ప్రయాణాన్ని జీవంగాను చూపిస్తున్నాయి. జననం, గౌతముని రాజకుమార జీవితం, బోధి వృక్షం కింద జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్వాణం వంటి ముఖ్య ఘట్టాలు ప్రతీ శిల్పంలో ప్రతిబింబిస్తున్నాయి. సందర్శకులకు ప్రతి శిల్ప సమూహం ఆధ్యాత్మికత, శాంతి, బోధనలను స్పష్టంగా తెలియజేసేలా రూపొందించారు.


