News February 24, 2025

మద్దూరు: అదృశ్యమై.. శవమై కనిపించాడు

image

మద్దూరు మండలంలో ఓ గుర్తు <<15554760>>తెలియని <<>>వ్యక్తి ఉరేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ విజయ్‌కుమార్ వివరాలు.. రెనివట్ట గ్రామానికి చెందిన రాములు(50) గత నెల 20న ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన భార్య 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆదివారం ఆయన చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాములుగా గుర్తించారు.

Similar News

News November 9, 2025

ఈనెల 11న ములుగులో ‘ఐక్యత పాదయాత్ర’

image

‘ఏక్ భారత్ – ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో ఈ నెల 11న ఉదయం ములుగులో జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. యువతలో దేశభక్తి, ప్రజల్లో సమైక్యతను పెంచేందుకు ఈ యాత్రను చేపట్టారు. ఉదయం 9:30 గంటలకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ వరకు జరిగే ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News November 9, 2025

వేములపల్లిలో ఉరేసుకుని వివాహిత మృతి

image

ఉరివేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం ద్వారపూడి శివారు వేములపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. ముమ్మిడివరం (m) సోమదేవరపాలెంకు చెందిన మట్టా రేఖ (24) వేములపల్లిలో పాకలో ఉరివేసుకుని మృతి చెందింది. వేములపల్లిలో తండ్రి ఇంటికి 4నెలల క్రితం కాన్పుకోసం వచ్చింది. ఫోన్లో ఆమె భర్త వేణుతో గొడవ పడినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

News November 9, 2025

పేకాట శిబిరంపై దాడి.. రూ.68,920 సీజ్‌: సీఐ

image

కురుపాం మండలం సింగుపురం సమీపంలో పేకాట శిబిరంపై సీఐ బి.హరి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకొని వారి వద్ద ఉన్న రూ.68,920 సీజ్‌ చేశామని సీఐ తెలిపారు. పట్టుబడినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఎస్సైలు నారాయణరావు, శివప్రసాద్, పోలీస్ సిబ్బంది