News February 16, 2025
మద్దూర్: అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలోని మోమినాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. తీవ్ర గాయాలతో చిరుత మృతి చెందినట్లు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు, వెటర్నరీ సిబ్బంది అక్కడికి చేరుకొని ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 25, 2025
‘ఆస్కార్’ గెలుపొందిన దర్శకుడిపై దాడి

‘ఆస్కార్’ గ్రహీత, పాలస్తీనా దర్శకుడు హందాన్ బల్లాల్‌పై వెస్ట్ బ్యాంక్‌లో దాడి జరిగింది. తొలుత సెటిలర్లు దాడి చేయగా ఆ తర్వాత ఇజ్రాయెల్ బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. హందాన్‌కు తల, కడుపుపై గాయాలయ్యాయని సన్నిహితులు తెలిపారు. అయితే అతడి అరెస్టుపై ఇజ్రాయెల్ బలగాలు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ‘నో అదర్ ల్యాండ్’ పేరిట పాలస్తీనాపై హందాన్, అతడి టీమ్ రూపొందించిన డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది.
News March 25, 2025
తాడిపత్రిలో పెద్దారెడ్డికి నో ఎంట్రీ బోర్డ్!

తాడిపత్రి నియోజకవర్గంలోని YCP శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కీలక నేతలంతా యాక్టివ్‌గా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలూ పెద్దగా జరగడంలేదు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తనను తాడిపత్రికి వెళ్లకూడదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 9నెలల నుంచి ఇదే సాగుతోంది. ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు. మరోవైపు దూకుడుతో JC తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
News March 25, 2025
GDK: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోదావరిఖనికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.