News April 24, 2025

మద్నూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం మద్నూర్, రామారెడ్డిలో 44.8, పల్వంచలో 44.7, జుక్కల్, బాన్సువాడ, డోంగ్లిలో 44.6, నస్రుల్లాబాదులో 44.5, బిచ్కుందలో 44.4, దోమకొండలో 44.1, లింగంపేటలో 43.9, అత్యల్పంగా బీబీపేట మండలంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని అధికారులు సూచించారు.

Similar News

News April 25, 2025

45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ

image

TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న నిజామాబాద్, ADLB, నిర్మల్, MNCLలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా NZMBలోని సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

News April 25, 2025

సీఎం చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్

image

రేపు (శనివారం) CM చంద్రబాబు ఎచ్చెర్లకు రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది.☛ 10:00AM విజయవాడ ఏయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో రాక☛11:55AM బుడగట్లపాలెం హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ ☛12:10 PM బుడగట్లపాలెంలో అమ్మవారిని దర్శించుకుంటారు.☛ 1:20 నుంచి బుడగట్లపాలెం ప్రజలతో సమావేశం.☛ 3:25PM – 4:55PM పథకం ప్రారంభ కార్యక్రమం.☛5:00PM తిరిగి బుడగట్లపాలెం హెలిప్యాడ్ నుంచి విశాఖ ప్రయాణం.

News April 25, 2025

ఇవాళ CSKvsSRH.. ఓడిన జట్టు ఖేల్ ఖతం

image

పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడుతున్న SRH, CSK మధ్య ఇవాళ సా.7.30కు కీలక మ్యాచ్ జరగనుంది. ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్ సన్నగిల్లుతుంది. 2 టీమ్స్ బ్యాటింగ్, బౌలింగ్ లోపాలతో ఇబ్బందిపడుతున్నాయి. హోంగ్రౌండులో ఆడుతుండటం CSKకు కలిసొచ్చే అంశం. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్ చూపాలని CSK, కాటేరమ్మను గుర్తుతెచ్చుకుని అదరగొట్టాలని SRH అభిమానులు కోరుకుంటున్నారు. ఇవాళ ఏ జట్టు గెలుస్తుంది? మీ కామెంట్

error: Content is protected !!