News January 25, 2025
మద్నూరు: జొన్న రొట్టెతో ఎన్నికల సంఘం చిహ్నాలు…!

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వినూత్నంగా చిత్రం గీశాడు. జొన్న రొట్టెతో ఎన్నికల సంఘం చిహ్నాలు తయారు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రయుధమని, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్రం ద్వారా కోరారు. దీన్ని చూసిన పలువురు బాల్ కిషన్‌ను అభినందించారు.
Similar News
News November 18, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.
News November 18, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రౌడీ షీటర్లకు పాలకుర్తి సీఐ కౌన్సిలింగ్
> నవాబుపేట రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కడియం
> కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న జనగామ కలెక్టర్
> జనగామలో యువ వికసిత భారత్ 2k రన్
> ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
> మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీవో
> జనగామకు జల సంచాయ్ జన్ భగీరథి అవార్డు
News November 18, 2025
తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.


