News January 25, 2025

మద్నూరు: జొన్న రొట్టెతో ఎన్నికల సంఘం చిహ్నాలు…!

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వినూత్నంగా చిత్రం గీశాడు. జొన్న రొట్టెతో ఎన్నికల సంఘం చిహ్నాలు తయారు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్రం ద్వారా కోరారు. దీన్ని చూసిన పలువురు బాల్ కిషన్‌ను అభినందించారు.

Similar News

News October 30, 2025

నంచర్ల గేట్ వద్ద కారు-బొలెరో ఢీ.. నలుగురికి గాయాలు

image

మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గేట్ బస్టాండ్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న కారు-బొలెరో ఢీకొనడంతో కారులో ఉన్న విష్ణు, మల్లేష్, శేఖర్‌కు గాయాలయ్యాయి. బొలెరోలో కర్నూలుకు వెళుతున్న రోషన్‌కు కూడా తలకు, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ మెహబూబ్ బాషా, పైలట్ అక్బర్ అక్కడే ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News October 30, 2025

ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు పరార్

image

దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ ప్రొడక్ట్స్ వాడతాం. వీటి ప్రభావం మనపై కూడా పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. బంతి, తులసి, లావెండర్, రోజ్మేరీ, కలబంద మొక్కలు దోమలను తరిమేయడంలో సహకరిస్తాయి. అలాగే ఇంటి బయట వేప, యూకలిప్టస్ చెట్లను పెంచినా దోమల బెడద తగ్గుతుందంటున్నారు నిపుణులు.

News October 30, 2025

ఆదిలాబాద్: ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

image

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.