News January 25, 2025
మద్నూరు: జొన్న రొట్టెతో ఎన్నికల సంఘం చిహ్నాలు…!

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వినూత్నంగా చిత్రం గీశాడు. జొన్న రొట్టెతో ఎన్నికల సంఘం చిహ్నాలు తయారు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్రం ద్వారా కోరారు. దీన్ని చూసిన పలువురు బాల్ కిషన్‌ను అభినందించారు.
Similar News
News February 7, 2025
బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. రేవంత్ యోచన?

TG: రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో CM రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు BCలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక Dy.CM పదవి ఉంటుందని టాక్. ST, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
News February 7, 2025
ITలో అతిపెద్ద IPO.. 12న హెక్సావేర్ పబ్లిక్ ఇష్యూ

ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.8,750 కోట్ల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీవో కొనసాగనుంది. బ్రాండ్ ధరను రూ.674-రూ.708గా ఫిక్స్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఐటీ సెక్టార్‌లో ఇదే అతిపెద్ద ఐపీవో కావడం విశేషం. 20 ఏళ్ల కిందట TCS రూ.4,700 కోట్లు సమీకరించింది.
News February 7, 2025
సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు

మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపర్డెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, దేవాదాయ అర్చకులు పాల్గొన్నారు.