News March 29, 2024
మద్నూర్‌లో ఘరానా దొంగ అరెస్ట్
మండలంలో జరిగిన <<12933675>>భారీ చోరీ<<>> కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రూ.13.50 లక్షల నగదును రికవరీ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మద్నూర్ మండలంలో నివాసం ఉండే మహాజన్ బాలాజీ ఇంట్లో ఈ నెల 26న రాత్రి చోరీ జరిగింది. బీరువాలో దాచిన 25 తులాల బంగారం, నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 12, 2025
NZB: జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 12 గంటలకు నిజామాబాద్‌లో జరిగే ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను కవిత ప్రారంభిస్తారు. అనంతరం ఒంటి గంటకు తబ్లిగీ జమాత్ వేదిక సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వర్ని బడాపహాడ్ దర్గాను దర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలలో సమావేశమై, పలు అంశాలపై చర్చిస్తారు.
News January 12, 2025
కాంగ్రెస్ సమాధానం చెప్పాలి: ఎమ్మెల్సీ కవిత
యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ నాయకుల దాడిని MLC కవిత ‘X’ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఆమె దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతను గూండాయిజం చేసేలా తీర్చిదిద్దుతోందని ఆమె ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై NSUI, IYC నాయకుల దాడి, వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని మండిపడ్డారు. ఈ సిగ్గు చేటు ఘటనకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు.
News January 12, 2025
కార్పొరేషన్‌పై కాషాయి జెండా ఎగురవేయడమే మా లక్ష్యం: ఎంపీ అరవింద్
బీజేపీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారికీ హైదరాబాద్‌లోని ఎంపీ అరవింద్ నివాసంలో శనివారం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. కార్పొరేషన్‌పై జెండా ఎగరవేయడమే లక్ష్యమని ఎంపీ అరవింద్ అన్నారు.