News December 20, 2024
మద్నూర్: యాసంగి పంటలకు జింకల బెడద
మద్నూర్ మండలంలో యాసంగి పంటలకు జింకల బెడద ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జొన్న, శనగ, మినుము, మొక్కజొన్న సాగు పంట భూములలో పెద్ద సంఖ్యలో జింకలు వచ్చి పంటను నష్ట పరుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలోను జింకల కారణంగా పంటలను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు జింకలు బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
Similar News
News January 5, 2025
కామారెడ్డి: ద్వితీయ స్థానంలో నిలిచిన అనిల్
క్యాసంపల్లి ZPHS పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అనిల్ తేజ్, ఇటీవల ఆదిలాబాద్లో జరిగిన ఎనిమిదవ ఇంటర్ డిస్ట్రిక్ట్ మౌంటెన్ సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించారు. ఈ విజయంతో అనిల్ తేజ్ సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రం అందుకున్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు నరసింహరావు, గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ అభినందించారు.
News January 5, 2025
ఎడపల్లి: యువకుడి పై కత్తులతో దాడి
ఎడపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు తన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి మిత్రులతో ముచ్చటిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్, నరేష్, కల్యాణ్, చంద్రకాంత్ అతని తమ్ముడు రవికాంత్ దుర్భషలాడుతూ.. ప్రణయ్ పై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రణయ్ మిత్రులు అక్కడి నుంచి పారిపోయారు. వారు ప్రణయ్ పై కత్తులతో దాడి చేసి గాయపర్చారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నామన్నారు.
News January 5, 2025
ఆర్మూర్: కోడి పందెల స్థావరంపై పోలీసుల దాడి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం దూదేకుల కాలనీలో కోడి పందెలు నిర్వహిస్తున్న 13 మందిని పట్టుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వారి నుంచి కోడి కత్తులు, రూ.7,380 నగదు, 11 సెల్ ఫోన్లు, 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.