News August 9, 2024

మద్నూర్‌: హత్య కేసులో నిందితుడికి రిమాండ్

image

మద్నూర్‌లో తండ్రిని చంపిన ఘటనలో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బిచ్కుంద CI నరేష్ వివరాలు.. మద్నూర్ వాసి అర్జున్ (64) ఇటీవల తన పొలంను విక్రయించాడు. ఈ క్రమంలో కొడుకు బైక్ కొనుగోలు కోసం తండ్రైన అర్జున్ వద్ద డబ్బులు అడిగాడు. నిరాకరించడంతో కోపంతో వెంకట్ కర్రతో అర్జున్ తలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడు. కేసు విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

Similar News

News December 4, 2025

NZB: ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు.

News December 4, 2025

ఎడపల్లి: ఎన్నికల విధులను అప్రమత్తతతో నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ఈ నెల 11న మండలంలో మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల నుంచి పోలింగ్ ఏర్పాట్ల వరకు కలెక్టర్ సమీక్షించారు.

News December 4, 2025

NZB: మరోసారి అవకాశం కల్పిస్తా ఈ సారికి ఆగు..!

image

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మూడో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.