News November 20, 2024
మద్యం అమ్మకాలపై ఉన్న ప్రేమ రైతుల మీద లేదు: హరీశ్ రావు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఉన్న ప్రేమ ప్రభుత్వానికి రైతుల పైన లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బుధవారం మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డితో కలిసి కురుమూర్తి జాతరకు వెళుతున్నా ఆయన మార్గమధ్యలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇస్తామన్న 500 బోనస్ బోగస్ పథకంగా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని మండిపడ్డారు.
Similar News
News March 5, 2026
మహబూబ్‌నగర్: 254 మంది విద్యార్థులు గైర్హాజరు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మ్యాథమెటిక్స్ జువాలజీ హిస్టరీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 254 మంది గైర్హాజరైనట్టు జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. నేటి పరీక్షకు మొత్తంగా 10,156 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,902 విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష సందర్భంగా ఇటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
News March 5, 2026
పాలమూరు: GOVT పథకాలపై వర్క్ షాప్

మహబూబ్ నగర్ లోని SBI, RSETI శిక్షణ కేంద్రంలో భారత ప్రభుత్వం యువజన సర్వీసు, క్రీడల ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా పరిశ్రమ శాఖ అధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరమన్నారు. SBI,RSETI సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, యువజన అధికారి కోటా నాయక్, శిక్షణ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News March 4, 2026
మన్యంకొండలో వైభవంగా అమ్మవారి ‘అశ్వవాహన’ సేవ!

మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య ఈ సేవ వైభవంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.


