News March 21, 2024

మద్యం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మద్యం గోడౌన్, తయారీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ తనిఖీ చేశారు. బుధవారం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దేవరపాలెం వద్ద గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.

Similar News

News November 22, 2025

ఆత్మకూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఆరుగురు

image

ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం గ్రామం నుంచి పశువులు మేపుకునేందుకు నదిలోకి వెళ్లిన కాపర్లు ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో నది మధ్యలో చిక్కుకున్నారు. వారిలో వెంకట రమణయ్య, శ్రీనివాసులు, కాలేషా, కవిత, చెన్నయ్యతోపాటు మరో మహిళ ఉన్నట్లు సమాచారం. వీరిని కాపాడేందుకు పోలీసులు రంగంలో దిగారు.

News November 22, 2025

మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: డీఈవో

image

వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12. 45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలని కోరారు.

News November 22, 2025

నెల్లూరు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.23 లక్షల స్వాహా

image

నెల్లూరు రూరల్‌లోని శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల సెగ తగిలింది. CBI పేరుతో డిజిటల్ అరెస్టుకు పాల్పడి అతని వద్ద నుంచి రూ.23 లక్షలు స్వాహా చేశారు. మహిళలకు అసభ్యకరమైన ఫొటోలు పంపించినందుకు తాము అరెస్టు చేస్తున్నట్లు బెంగళూరు నుంచి CBI అధికారుల పేరుతో కాల్ చేసి భయపెట్టారు. బాధితుడు రూ.23 లక్షలు చెల్లించి మోసపోవడంతో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.