News March 15, 2025
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి సూసైడ్

మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని చిన్న రామయ్య(30) ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొలిమిగుండ్ల మండలం బెలుంలో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్నరామయ్య ప్రతిరోజూ మద్యం తాగేవాడు. శుక్రవారం మద్యానికి భార్య శోభను డబ్బులు అడగగా.. ఆమె ఇవ్వలేదు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 4, 2025
భద్రాద్రి: ‘ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరి’

పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కల్పించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీసీలో కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు లావణ్య, అదనపు కలెక్టర్ విద్యచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు.
News December 4, 2025
హార్టికల్చర్ హబ్‌కి కేంద్రం ₹40వేల కోట్లు: CBN

AP: హార్టికల్చర్ హబ్‌గా 9 జిల్లాలను తయారుచేస్తున్నామని CM CBN తెలిపారు. దీనికోసం కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ₹40వేల కోట్లు ఇస్తోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పారు. అధికారులు టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. 7వ తరగతి నుంచే AI బేసిక్స్‌పై బోధన ఉండాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని చెప్పారు.
News December 4, 2025
కంట్రోల్ రూమ్‌లను వినియోగించుకోవాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్&మానిటరింగ్ కమిటీ, సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఏమైనా సమస్యలు ఉంటే, ఎన్నికలకు సంబంధించిన సమాచారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 96662 34383 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


