News March 9, 2025
మద్యం తాగి వాహనాలు నడపకండి: ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ మీ జీవితానికే కాకుండా ఇతరులకూ ప్రమాదకరం. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో మీ ప్రతిచర్యలు మందగిస్తాయి. అందరూ సేఫ్‌గా గమ్యస్థానాలను చేరుకోవాలి’ అంటూ ఎస్పీ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News October 22, 2025
నాగర్‌కర్నూల్: ఊర్కొండలో అత్యధిక వర్షపాతం

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. జిల్లాలోనే అత్యధికంగా ఊర్కొండలో 37.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. చారకొండలో 31.8 మి.మీ., పదరలో 22.2 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. మిగతా ప్రాంతాలలో కూడా ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.
News October 22, 2025
పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.
News October 22, 2025
టీచర్లకూ టెట్.. త్వరలో నోటిఫికేషన్!

AP: టీచర్లకూ టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు జాబ్‌లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. నిరుద్యోగులు, టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేళ్లలో టెట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.