News February 24, 2025

మద్యం దుకాణాలు 48 గంటలపాటు బంద్: కలెక్టర్ 

image

ఈ నెల 27వ తేదీన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కారణంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను 48 గంటలు మూసివేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఛీప్ ఎలక్టోరల్ అధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 25 సాయంత్రం 4.00 గంటల నుంచి 27 సాయంత్రం 4.00 గంటల వరకు డ్రై డేగా ఉంటుందని, దీనికి అందరూ సహకరించాలన్నారు.

Similar News

News March 25, 2025

MBNR: ‘లంబాడీ గిరిజనులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి’

image

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి సంక్షేమానికి కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు నాయక్ కోరారు. MBNRలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తండాలను పంచాయతీలుగా, గోర్ బోలి భాషను 8 షెడ్యూల్‌లో, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, నిరుద్యోగ భృతి,గిరిజనులకు ట్రైకార్ రుణాలు మంజూరు చేసి న్యాయం చేయాలన్నారు. గిరిజన సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నారు.

News March 25, 2025

ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 25, 2025

ASF: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!