News August 27, 2024
మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి

మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆపై నిప్పంటించుకున్న ఘటన మంగళవారం కొత్తగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన ఇమ్మానుయేల్(54) ఆటో డ్రైవర్ గా వృత్తి నిర్వహిస్తున్నాడు. కాగా మద్యం మత్తులో ఉన్న ఇమ్మానుయేల్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో 90% శరీరం కాలిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 8, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10,552 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఎలాంటి కొరత లేదని గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా కోసం మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు నిల్వలు చేరవేసే చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 29,178 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
News January 8, 2026
ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా ఏదులాపురం!

ఖమ్మం రూరల్ మండలంలోని 12 పంచాయతీలతో ఏర్పడిన నూతన ఏదులాపురం మున్సిపాలిటీ, జిల్లాలోనే అత్యధిక ఓటర్లు (45,256), వార్డులు (32) కలిగిన పురపాలికగా నిలిచింది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. 26 అభ్యంతరాలు రాగా, బీఎల్ఓల విచారణ అనంతరం ఈ నెల 10న తుది జాబితా ప్రకటించనున్నారు. అత్యధికంగా ఒకటో వార్డులో 1,710 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News January 8, 2026
ఖమ్మంలో రేపు జాబ్ మేళా

ఖమ్మం: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.శ్రీరామ్ తెలిపారు. ఫార్మసీ కోర్సులు చేసిన వారితో పాటు పదో తరగతి, ఇంటర్ అర్హత ఉన్న వారు కూడా హాజరుకావచ్చు. నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు మేళాకు రావాలని ఆయన కోరారు.


