News November 17, 2024
మద్యం మత్తులో కిందపడి యువకుడి మృతి
గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ సాకేత్ అనే యువకుడు మద్యం మత్తులో జారి రోడ్డుపై పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ సాకేత్ కొత్తపేట సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో స్టోర్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. అతిగా మద్యం తాగి జారి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 13, 2024
అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు: MLA కాల్వ
అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ రాయదుర్గం MLA కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు అని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు రైతాంగానికి, సాగునీటి రంగానికి ఏమీ చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.
News December 13, 2024
పెనుకొండ బాబయ్య స్వామి చరిత్ర.. (1/1)
పెనుకొండ బాబయ్య స్వామి 752వ గంధం, ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా బాబా ఫకృద్దీన్ జన్మస్థలం ఇరాన్ దేశం. చక్రవర్తిగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో గురువుల ఆదేశానుసారం ఇరాన్‌ను వీడుతారు. దేశాలన్నీ తిరుగుతూ తమిళనాడులోని తిరుచనాపల్లికి చేరతారు. అక్కడ సత్తేహార్ తబ్రే ఆలం బాద్‌షాను గురువుగా పొందుతారు. ఆయన వేపపుల్ల ఇచ్చి పెనుకొండకు వెళ్లమని బాబాను ఆదేశిస్తారట. <<14864905>>Cont’d..<<>>
News December 13, 2024
అప్పటి నుంచి ఏటా ఉరుసు ఉత్సవాలు (1/2)
అలా <<14864840>>బాబా<<>> ఫకృద్దీన్ పెనుకొండ శివారులోని ఓ మంటపంలోకి చేరుకుంటారు. ప్రజలకు ప్రేమను పంచుతూ మతసామరస్యాన్ని వివరించేవారు. బాబయ్య స్వామిగా పేరొంది ప్రజలను ఆశీర్వదించేవారు. అయితే గురువు ఇచ్చిన వేపపుల్లను రోజూ తలకింద పెట్టుకుని నిద్రపోయేవారట. ఒక రోజు ఆ వేపపుల్ల చిగురించడంతో ఇదే తన నివాసమని భావిస్తారు. క్రీస్తుశకం 694లో పరమదించడంతో అక్కడే సమాధి చేశారు. అప్పటి నుంచి ఏటా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.