News March 6, 2025
మద్యం మత్తులో పురుగుమందు తాగి వ్యక్తి మృతి

పురుగుమందు తాగి ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని చైన్ పాక గ్రామంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్ది కిష్టస్వామి(60) తరచూ మద్యం తాగుతూ భార్యతో గొడవ పడుతుండేవాడు.ఈ క్రమంలో భార్య మద్యం తాగితే ఇల్లు ఎలా గడవాలి అని అడిగింది. దీంతో మద్యం మత్తులో పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు దవాఖానాకి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News October 14, 2025
వికారాబాద్ డీసీసీ పీఠం ఎవరికి.?

వికారాబాద్ జిల్లాలో DCC పీఠం ఎవరికి దక్కుతుందో కాంగ్రెస్, నాయకులు వేచి చూస్తున్నారు. పట్లోల రఘువీరారెడ్డి, అర్ధ సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. వాళ్లు తమ స్టైల్లో కైవసం చేసుకోవడానికి పైరవీలు భారీగా చేస్తున్నారు. జిల్లాలో ప్రతిపక్షంలో ఉంటూ పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన రఘువీరారెడ్డిని పార్టీ గుర్తించడం లేదంటూ నాయకులు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
News October 14, 2025
జనగామ: వేటగాళ్ల ఉచ్చులో పడి జింక మృతి

స్టేషన్ఘనపూర్ మండలం విశ్వనాథపురం గ్రామంలో సోమవారం వేటగాళ్ల ఉచ్చులో పడి జింక మృతి చెందింది. గ్రామస్తులు ఈ విషయాన్ని సంబంధిత అటవీ అధికారులకు తెలిపారు. తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ, పోలీసు శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
News October 14, 2025
ADB: బెస్ట్గా నిలవాలంటే.. బకాయిలు ఇవ్వాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు వెంటనే విడుదల చేసి, ఆ స్కూల్స్ యథావిధిగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. రెండున్నర సంవత్సరాలుగా స్కూల్ యాజమాన్యాలకు బిల్లులు విడుదల కాకపోవడంతో పిల్లలను బడుల్లోకి రానీయడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 15+ స్కూల్స్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. బకాయిలు ఇవ్వాలని కోరుతున్నారు.