News April 13, 2025
మద్యం సేవించి వాహనం నడపడం నేరం: సీపీ వరంగల్

మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ మద్యం సేవించిన వాహనదారుల వలన కలిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత నెల రోజుల్లో జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో మొత్తం 3029 కేసులు నమోదయ్యాయన్నారు.
Similar News
News November 26, 2025
పంటలలో తెగుళ్ల ముప్పు తగ్గాలంటే..

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.
News November 26, 2025
SKLM: ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. అంబేడ్కర్ చిరస్మరణీయులని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. చట్ట పాలనను సాగించడంలో పోలీసులు ముందుండాలన్నారు.
News November 26, 2025
నితీశ్ కుమార్ రెడ్డి.. అట్టర్ ఫ్లాప్ షో!

తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఘోరంగా విఫలం అవుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో సెంచరీ తర్వాత అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆ సెంచరీ తర్వాత అతడి 10 ఇన్నింగ్సుల స్కోర్ 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0గా ఉంది. అంటే 10 ఇన్నింగ్సుల్లో 10 సగటుతో 103 రన్స్ చేశారు. అటు బౌలింగ్‌లోనూ వికెట్లు తీయలేకపోతున్నారు.


