News May 10, 2024

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. గొంతు కోసుకున్న భర్త

image

నంద్యాల పట్టణంలోని పప్పులబట్టి బజార్‌కు చెందిన జాకీర్ అనే వ్యక్తి మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. మధ్యాహ్నం ఓ పార్టీ నాయకులు జాకీర్ కుటుంబానికి ఓట్ల డబ్బులు పంపిణీ చేశారు. తన ఓటు డబ్బులు తనకే ఇవ్వాలని భార్యను జాకీర్ బెదిరించాడు. అయినా భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో జాకీర్ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News April 18, 2026

భూగర్భ జలాల పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు మండలం ఆమడగుంట్లలో నీటి భద్రత, జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. వంకలను, వాగులను, చెరువులను గుర్తించి వాటికి మరమ్మత్ పనులు చేపట్టి నీరు నింపుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

News April 18, 2026

జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 479 గ్రామాల్లో 3,435 పనులను గుర్తించినట్లు ఆమె తెలిపారు. చెరువులు, కుంటల పూడికతీత ద్వారా నీటి నిల్వలు పెంచడమే లక్ష్యమన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.