News April 6, 2025

మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్నతల్లి హత్య

image

మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన బీబీన‌గర్ మండలంలో జరిగింది. CI ప్రభాకర్‌ తెలిపిన వివరాలు.. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి(50) రాములు దంపతుల కుమారుడు శ్రీను. భార్యతో కలిసి చేవెళ్లలో ఉంటున్నాడు. APR 4న భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపంతో మోజి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.

Similar News

News December 13, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ సమయానికి ప్రారంభించి, ఎటువంటి జాప్యం లేకుండా ఫలితాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.

News December 13, 2025

22 ఏళ్లకే ఉపసర్పంచ్‌గా ఎన్నిక.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ప్రజాసేవకు!

image

శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామ యువతి బండారి రిషిత (22) అరుదైన ఘనత సాధించారు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించిన ఆమె, గ్రామాభివృద్ధి ధ్యేయంగా కొలువును వదిలారు. ఈమె మంచి మనసును గుర్తించిన గ్రామస్తులు రిషితను తొలి విడత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. యువతకు రిషిత ఆదర్శంగా నిలిచారు.

News December 12, 2025

NLG: స్టేజ్- 2 ఆర్ఓ సస్పెండ్: కలెక్టర్

image

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన ఘటనలో స్టేజ్- 2 ఆర్‌వో‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.