News May 10, 2024
మధిర: ఉరివేసుకుని యువతి మృతి..

మధిర పట్టణంలోని అన్నపూర్ణ మెస్ పక్కన విజయవాడ నుంచి వచ్చిన ఓ యువతి (22) అద్దెకు నివాసం ఉంటోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ సహకారంతో మధిర టౌన్ ఎస్ఐ సహకారంతో మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 19, 2025
ఖమ్మం: పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్: మంత్రి

అడవి జంతువులు, కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ పథకం ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వ్యవసాయశాఖ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పామాయిల్‌తో పాటు ఇతర పంటలకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను రైతులకు అందించాలని కోరారు. రాష్ట్ర అవసరాలు తీర్చేలా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
News February 19, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News February 19, 2025
భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద భద్రత పెంపు

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ వద్ద ఉన్న ఉమ్మడి చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటీవల గంజాయి స్మగ్లర్లు ద్విచక్ర వాహనంతో వాహనాల తనిఖీ చేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ని వేగంగా ఢీకొట్టి పారిపోయాడు. ఇలాంటి ఘటనలు మరోమారు ఉత్పన్నం కాకుండా భద్రాచలం టౌన్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టారు.