News April 14, 2025
మధిర ఎంతో మంచిర్యాల అంతే ఇష్టం: డిప్యూటీ సీఎం

తన సొంత నియోజకవర్గం మధిర ఎంతో మంచిర్యాల కూడా అంతే ఇష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఉమ్మడి ADB జిల్లా ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిదని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని వెల్లడించారు.
Similar News
News December 6, 2025
విశాఖ: రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాట్లకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖలో 12 రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఖాళీ అవుతున్న 25 డ్వాక్రా మహిళలు, ఆరు PHC స్టాల్స్‌కు డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అందజేయాలి.
News December 6, 2025
కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.
News December 6, 2025
విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.


