News February 11, 2025
మధిర: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

మంగళవారం తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల ప్రకారం.. ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ జైపూర్- చెన్నై ఎక్స్ ప్రెస్ కిందపడటంతో అతడి తల తెగిపోయింది. లోకో పైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 1, 2025
ఎన్నికల శిక్షణకు గైర్హాజరు.. అధికారులకు షోకాజ్ నోటీసులు

పంచాయతీ ఎన్నికల శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా హాజరుకాని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల విధులు చాలా కీలకమని, సిబ్బందిని సన్నద్ధం చేసేందుకే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వీరిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 1, 2025
IELTSకు దరఖాస్తుల ఆహ్వానం: బీసీ స్టడీ సర్కిల్

ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (IELTS) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, అంతర్జాతీయ స్కాలర్షిప్ పొందడం లక్ష్యంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 1, 2025
మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి: తుమ్మల

మార్చి 2026 నాటికి ఖమ్మం మున్నేరు రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నగర్ మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో తుమ్మల సమీక్షించారు. ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని పేర్కొన్నారు.


