News October 30, 2024

మధిర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రీ కూతురు మృతి

image

మధిర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. విజయవాడలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు దిగి వస్తుండగా, మధిర మండలం మల్లారానికి చెందిన కొంగర కేశవరావు, ఖమ్మంపాడుకు చెందిన కూతురు నూకారపు సరితపై చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 8, 2026

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10న ఖమ్మంలో జాబ్ మేళా

image

ఖమ్మం టేకులపల్లి ITI మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 21-35 సం.ల వయస్సు, ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.2.4 లక్షల నుంచి రూ.3.5 లక్షలు ఉంటుందని, జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 8, 2026

ఖమ్మం: కర్మకాండలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

image

బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లికి చెందిన సుతారీ మేస్త్రి అన్నెపర్తి ఎల్లయ్య శనివారం రాత్రి బైక్‌పై వస్తుండగా.. జిన్నింగ్‌ మిల్లు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 8, 2026

‘మధిర అంటే నాకు ప్రాణం’ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

image

‘మధిర అంటే నాకు ప్రాణం..నా జన్మధన్యమయ్యేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మధిర పట్టణాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.