News October 12, 2024
మధిర: వాహన పూజలు చేసిన డిప్యూటీ సీఎం

విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వాహన పూజా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని, సుఖ సంతోషాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని తన క్యాంపు కార్యాలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.
Similar News
News December 11, 2025
OFFICIAL: మొదటి విడత పోలింగ్ 90.08 శాతం నమోదు

మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఖమ్మం జిల్లాలో 90.08 శాతం నమోదైందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనకల్ మండలంలో 90.85 శాతం, చింతకాని మండలంలో 91.05 శాతం, కొణిజెర్ల మండలంలో 89.61 శాతం, మధిర మండలంలో 90.08 శాతం, రఘునాథపాలెం మండలంలో 91.09 శాతం, వైరా మండలంలో 90.67 శాతం, ఎర్రుపాలెం మండలంలో 87.28 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 11, 2025
6 వేల మందికి పైగా బైండోవర్ చేశాం: ఖమ్మం సీపీ

జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రశాంతంగా వున్న గ్రామాల్లో సమస్య సృష్టించే వ్యక్తులను ముందుస్తుగానే 6 వేల మందికి పైగా బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
News December 11, 2025
ఖమ్మం జిల్లాలో తొలి సర్పంచి విజయం

రఘునాథపాలెం మండలంలో ఓ సర్పంచ్ ఫలితం వెలువడింది. ఈరోజు జరిగిన ఎన్నికలో లచ్చిరాం తండాలో ప్రజలు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మాలోతు సుశీల వైపు మొగ్గు చూపారు. 42 ఓట్ల తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.


