News May 12, 2024
మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు..!

HYD పరిధి హయత్‌నగర్‌లో డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈరోజు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు చేపడుతోంది. తనిఖీల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంటి పరిసరాల్లో ఉన్న వారితో మాట్లాడి, డబ్బు పంపిణీపై ప్రత్యేక బృందం ఆరా తీసింది. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, డబ్బు పంపిణీని అడ్డుకోవడం కోసం అధికారులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు.
Similar News
News March 14, 2026
NZB: 16న ఎక్సైజ్ వాహనాల బహిరంగ వేలం

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పట్టుబడిన వివిధ వాహనాలకు ఈనెల 16న బహిరంగ వేలం నిర్వహించనున్నారు. సుభాష్ నగర్‌లోని ఎక్సైజ్ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. వేలంలో పాల్గొనే వారు రూ. 5,000 డిపాడిట్ చెల్లించి హాల్ టికెట్ పొందాలని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.
News March 14, 2026
NZB: ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు.. 51 మంది గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 24,404 మంది విద్యార్థులకు గాను 24,353 మంది హాజరైనట్లు డీఈవో అశోక్ తెలిపారు. వివిధ కారణాలతో 51 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని డీఈవో స్పష్టం చేశారు.
News March 14, 2026
NZB: పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్: సీపీ

నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని 144 కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు సీపీ పి.సాయి చైతన్య తెలిపారు. పరీక్షా సమయాల్లో కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.


