News April 24, 2025

మధుసూదన్ ఇంటికి రానున్న Dy.CM పవన్

image

ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయానికి Dy.CM పవన్ కళ్యాణ్ నివాళులర్పించనున్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కావలికి రానున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

Similar News

News April 24, 2025

NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

image

రేషన్‌ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్‌ ఇంటర్‌​నెట్​లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.

News April 24, 2025

16 పాఠశాలల్లో అందరూ పాస్: అరుణమ్మ

image

నెల్లూరులోని 16 జడ్పీ పాఠశాలల్లో అందరూ పాసయ్యారని జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 10,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 7,414 మంది పాసయ్యారని చెప్పారు. 595 మార్కులతో పూజిత అనే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు.

News April 24, 2025

మరికాసేపట్లో మధుసూదన్ ఇంటికి మంత్రి ఆనం 

image

ఉగ్రవాదుల దాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించనున్నారు.  

error: Content is protected !!